ఘనంగా సామూహిక సత్యసాయి వ్రతాలు
PPM: బలిజిపేట మండలం శ్రీసత్యసాయిబాబా మందిరంలో శుక్రవారం భగవాన్ శ్రీసత్యసాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస్ చిన్నారులు, మహిళలు సామూహిక సత్యసాయి వ్రతాలు చేశారు. ఈ మందిరంలో ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని రమణమూర్తి గురువు అందరికీ వినిపించారు. అనంతరం బాలవికాస్ చిన్నారులతో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.