'అన్నా క్యాంటీన్ ఏర్పాటుకి ప్రతిపాదనలు సిద్ధం చేయండి'
ELR: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేయాల్సిందిగా మున్సిపల్ అధికారులని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశించారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు. పరిసర ప్రాంతాల నుంచి ఎంతోమంది పేదలు చింతలపూడి వచ్చి కనీస భోజనం వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనిచ, అలాంటి వారి కోసం అన్న క్యాంటీన్ ఉపయోగపడుతుందన్నారు.