VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
KMM: వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 19,300, కొత్త మిర్చి ధర రూ. 19,400, అటు క్వింటా పత్తి ధర రూ. 7,700గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 100 పెరగగా, కొత్త మిర్చి ధర రూ. 25 తగ్గింది, పత్తి ధర మాత్రం స్థిరంగా ఉందని వ్యాపారులు తెలిపారు.