Ph.D ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

HYD: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీహెచ్డి ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. కామర్స్, ఇంగ్లీష్, తెలుగు, ఆర్థిక, చరిత్ర, ప్రజా పరిపాలన, సామాజిక శాస్త్రం, భౌతిక, రసాయన, గణిత సబ్జెక్టుల్లో పీహెచ్డీల కోసం ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 30 చివరి తేదీగా పేర్కొన్నారు.