వైసీపీ రైతు విభాగం అధ్యక్షులుగా తమ్మిన

ELR: ఉంగుటూరు నియోజవర్గ వైసీపీ రైతు విభాగం అధ్యక్షులుగా యర్రమిల్లి పాడు గ్రామానికి చెందిన తమ్మిన శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రస్తుతం యర్రమిల్లిపాడు సర్పంచ్‌గా ఉన్నారు. ఈ పదవి బాధ్యతలు అప్పగించిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, పీఎసీ సభ్యులు పుప్పాల వాసుబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.