ఏఐకి కేంద్రంగా హైదరాబాద్: మంత్రి
హైదరాబాద్ ఇకపై టెక్నాలజీ హబ్ మాత్రమే కాకుండా.. ఏఐ భవిష్యత్తును నిర్మించే కేంద్రంగా మారుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నగరంలో కోవాసెంట్ కొత్త ఏఐ ఇన్నోవేషన్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు కృత్రిమ మేథస్సు యుగాన్ని నడిపేందుకు పోటీ పడుతున్నాయని చెప్పారు.