సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
NGKL: బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో శ్రీ శ్రీ అలివేల మంగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం కార్తీకమాసం పురస్కరించుకొని సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వామివారిని తెలుసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా నిర్వహించారు.