VIDEO: నాంపల్లిలో అరుదైన 'జీరో షాడో' ఘటన

HYD: నాంపల్లిలోని బిర్లా ప్లానిటోరియంలో శనివారం మధ్యాహ్నం 12:12కు అరుదైన ఖగోళ ఘటన 'జీరో షాడో డే' నమోదైంది. ఈ సమయంలో సూర్యుడు నిక్షిప్తం తలపై ఉండటంతో కొన్ని క్షణాల పాటు వస్తువులకు నీడ కనిపించలేదు. ఈ దృశ్యం కోసం ప్లానిటోరియం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నెమలి ఆకారంలో ఉన్న నీడలేని దృశ్యం సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంది.