గోకవరంలో రథం తయారీకి రూ. 25,000 వితరణ
E.G: గోకవరం మండలం మల్లవరం గ్రామపంచాయతీలోని శ్రీ ఉమా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపుకు రథాన్ని తయారు చేస్తున్నారు. ఈ రథం తయారీకి స్వగ్రామానికి చెందిన బండి నాగేశ్వరరావు చిన్న అల్లుడు రాజమండ్రి వాస్తవ్యులు గొల్లపల్లి శ్రీనివాసరావు దంపతులు రూ.25,000 విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు బుధవారం అందించారు.