గ్రామ సభల్లోనే లబ్ధిదారుల వివరాలు: మంత్రి
NLG: సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. గ్రామ సభల్లోనే రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పథకాల అమలులో అవకతవకలు లేకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు.