గుర్తుతెలియని వ్యక్తి మృతి
ప్రకాశం: అద్దంకి మండలం మేదరమెట్ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కొద్దిగా రోజులుగా ఈ ప్రాంతంలో కూలి పనులు చేసుకుంటూ తిరుగుతున్నట్లు తెలిపారు. మద్యానికి బానిసైనా ఆ వ్యక్తికి తరచూ పిట్స్ వస్తాయని స్థానికులు అన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.