లారీ ఢీకొని.. ఇద్దరు మృతి

E.G: కొవ్వూరు మండలం సీతంపేట రంగబొమ్మ సెంటర్ వద్ద శనివారం లారీ ఢీకొని కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ (26), దవురూరి సుబ్రమణ్యం (42) అనే ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మొక్కల పనికి ద్విచక్రవాహనాలపై కడియపులంకకు వెళ్తున్న కూలీలను, కొవ్వూరు వైపు వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.