రిటైర్మెంట్పై స్పందించిన ధోనీ

తన రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్న వేళ కెప్టెన్ కూల్ ధోనీ స్పందించాడు. 'వచ్చే IPL ఆడాలా వద్దా అనే విషయం నా శరీరమే చెబుతుంది. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకుంటా. ఈ సీజన్ ముగిశాక నా చేతిలో 6 నుంచి 8 నెలల సమయం ఉంటుంది. అప్పుడు నా శరీరం ఎలా స్పందిస్తుందో చూస్తా. ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది అనుకుంటే ఆడతా' అని తెలిపాడు.