గోకవరం పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదు

E.G: గోకవరం పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదైనట్లు ఎస్సై పవన్ కుమార్ బుధవారం విలేకరి సమావేశంలో తెలిపారు. ఠాగూర్ పాలెం గ్రామానికి చెందిన పిల్లి వీరమని అనే యువతి 17వ తేదీ తెల్లవారుజాము 4:00 గంటల నుంచి కనిపించకపోవడంతో బంధువుల ఇంటికి చుట్టుపక్క గ్రామాలను వెతికిన ఎంతకి ఆచూకీ దొరకపోవడంతో తండ్రి అప్పలరాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.