నేడు ఈ గ్రామాల్లో పవర్ కట్
SDPT: బస్వాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని ముత్తన్నపేట, పోరెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 11Kv సబ్‌స్టేషన్ పనుల కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కరెంట్ నిలిపివేస్తున్నట్లు సెక్షన్ ఏఈ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ మరమ్మతు పనులకు గ్రామస్తులు, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.