పెరిగిన తెలంగాణ ఆదాయం
TG: కొత్త రుణాలతో పాటు పన్నుల ఆదాయం అధికంగా ఉండటంతో రాష్ట్ర ఆదాయ, వ్యయాల్లో గణనీయంగా వృద్ధి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి భాగంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.22 లక్షల కోట్ల ఆదాయం రాగా.. రూ.1.11లక్షల కోట్లు ఖర్చయినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం రూ.14 వేల కోట్ల ఆదాయం అధికంగా ఉంది.