'అన్నదాత సుఖీభవతో గిరిజన రైతుల్లో ఆనందం'
ASR: అరకులోయ మండలం కొత్తబల్లుగూడ పంచాయతీ పరిధిలో మంగళవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా లభిస్తున్న ఆర్థిక సాయంతో గిరిజన రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నదని తెలిపారు. రైతుల ఇళ్లకు వెళ్లి సాయం వివరాలను తెలుసుకొని అవగాహన కల్పించారు.