ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు
GDWL: జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.