చెరువులో పడి వృద్ధుడి మృతి

చెరువులో పడి వృద్ధుడి మృతి

WNP: పానగల్ మండలానికి చెందిన గడ్డి చంద్రు (75) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారని ఎస్సై కురుమయ్య తెలిపారు. ఈనెల 13న సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళారని చెప్పారు. గురువారం పొల్కి చెరువులో మృతదేహం తేలియాడుతుందని రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. భార్య బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.