ఎమ్మెల్యే కాకర్లకు కాలనీ వాసుల వినతి
NLR: వింజమూరు సమీపంలోని జీవీకేఆర్ ఎస్టీ కాలనీ వాసుల సీజీఎఫ్ఎస్ భూములు నుడా ఆధీనంలోకి పోవడంతో తమ జీవన ఆధారం కోల్పోయామని కాలనీ వాసులు శుక్రవారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎదుట వాపోయారు. భూములను పరిశీలించడానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో ఎమ్మెల్యే చర్చించారు. రికార్డులను మరోసారి పరిశీలించి, కాలనీ వాసులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.