ద్విచక్ర వాహనదారులకి హెల్మెట్ తప్పనిసరి: సీఐ

ద్విచక్ర వాహనదారులకి హెల్మెట్ తప్పనిసరి: సీఐ

KDP: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఒంటిమిట్ట సీఐ బాబు అన్నారు. సిద్దవటం మండలంలోని కడప- చెన్నై జాతీయ రహదారి బాకరాపేట చెక్ పోస్ట్ వద్ద ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. సీఐ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్సు, వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.