ఫెలోషిప్ అవార్డును అందుకున్న తణుకు వాసి

ఫెలోషిప్ అవార్డును అందుకున్న తణుకు వాసి

W.G: సమాజ సేవలో విశిష్ట కృషి చేస్తున్న తణుకు పట్టణానికి చెందిన ఉందుర్తి ప్రసన్నకుమార్ అంబేడ్కర్ జాతీయస్థాయి ఫెలోషిప్ అవార్డును మంగళవారం అందుకున్నారు. కాకినాడ JNTU ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రసాద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవం అందజేశారు.