ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నిరసన

విజయనగరం: బేవరేజెస్ కార్పొరేషన్ యూనియన్ సభ్యుల పిలుపు మేరకు గత ఐదు సంవత్సరాలుగా, ప్రభుత్వం మద్యం దుకాణాల్లో, పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని మద్యం దుకాణ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. వేపాడ గ్రామంలో మద్యం దుకాణ సిబ్బంది సోమవారం భోజన సమయంలో ప్లకార్ట్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జీతాలు సకాలంలో చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు