తల్లి సర్పంచ్.. కూతురు మేయర్
NLG: ఉమ్మడి జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లికి చెందిన బండ సరోజ గత డిసెంబర్‌లో సర్పంచ్‌గా ఏకగ్రీవమైంది. అయితే, ఆమె కూతురు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 32వ డివిజన్ నుంచి బుర్రి చైతన్య కార్పొరేటర్‌గా ఎన్నికయింది. కాగా, ఈనెల 16న ఆమె మేయర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. దీంతో వీరిని పలువురు అభినందిస్తున్నారు.