యువతి అదృశ్యంపై కేసు నమోదు: ఎస్సై

KKD: కోటనందూరుకు చెందిన పొటనూరి కావ్యశ్రీ(19) అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామక్రిష్ణ తెలిపారు. కావ్యశ్రీ ఈ నెల 10న ఉదయం ఇంటి నుంచి మెడికల్ షాపుకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదన్నారు. బంధువుల ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో వెతికినా యువతి ఆచూకీ కనిపించక పోలీసు స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు.