VIDEO: వాతావరణంలో వచ్చే మార్పులతో రైతులు ఆందోళన

కోనసీమ: అయినవిల్లి మండలం మాగాం, పోతుకుర్రు, కె. జగన్నాధపురం గ్రామాల్లో రైతులు అధికంగా వరి పంట పండిస్తున్నారు. దాళ్వా వరి పంట ఒబ్బిడి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే శుక్రవారం వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతులకు కంగారు పుట్టించింది. వాతావరణం మేఘావృతం కావడంతో వర్షం వస్తే తడవకుండా ధాన్యంపై బరకాలతో కప్పారు.