VIDEO: వాహనాన్ని తప్పించబోయి కారు పల్టీలు

VIDEO: వాహనాన్ని తప్పించబోయి కారు పల్టీలు

HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున కారు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రెడ్డి మల్ల రాంకీ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.