రాజకీయాలు ఎవరి హక్కు కాదు: మంత్రి పొన్నం

రాజకీయాలు ఎవరి హక్కు కాదు: మంత్రి పొన్నం

TG: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. రాజకీయాలు ఎవరి హక్కు, ఎవరి సొంతం కాదని మంత్రి అన్నారు. ఐక్యంగా ఉంటేనే రాజకీయ ఎదుగుదల సాధ్యమని తెలిపారు. కేంద్రం కులగణన చేస్తామని చెప్పడం తెలంగాణ విజయమని చెప్పారు.