'రహదారి నిర్మాణంతో కాలనీల రూపురేఖలు మారనున్నాయి'
SRD: అమీన్పూర్ డివిజన్‌లో రూ. 3.25 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సాయి అంబికా కాలనీ నుంచి ఐలాపూర్ తాండ, లాలాబాయి కాలనీ నుంచి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా వరకు పనులు చేపడుతున్నారు. రహదారులు పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.