ఉద్యమకారుడి కుటుంబానికి చేయూత

ఉద్యమకారుడి కుటుంబానికి చేయూత

RR: తాండూరుకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సంగమేశ్వర్ కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి చేయూతనందించారు. పట్టణంలోని వడ్డెర గల్లికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు సంగమేశ్వర్ బుధవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుల ద్వారా కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.