VIDEO: మధ్యాహ్న భోజనంలో బల్లి..!
CTR: పుంగనూరులోని నగిరి కాంపౌండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించి కలకలం రేపింది. భోజనం చేసిన విద్యార్థులలో నలుగురికి వాంతులు కావడంతో ఉపాధ్యాయులు వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డాక్టర్లు పాఠశాలకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు భయంతో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.