ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల వేళ ఫుడ్ సేఫ్టీ, తూనికలు-కొలతల శాఖల అధికారులు సోమవారం పుట్టపర్తిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంఆర్‌పీకి మించి విక్రయించినా, నాసిరకం ఆహార పదార్థాలు అమ్మినా కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. అధిక ధరలు వసూలు చేస్తే 1950కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.