తిరుమల తిరుపతి కొండలకు మరో అరుదైన గౌరవం

TPT: తిరుమల తిరుపతి కొండలకు అరుదైన గౌరవం దక్కింది. సహజ వారసత్వ సంపదగా ప్రసిద్ధికెక్కిన తిరుమల కొండలు, భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని ఏడు ఆస్తులు యునెస్కో గుర్తింపుకు చేరువయ్యాయి. ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం రూపొందించిన తాత్కాలిక జాబితాలో వీటికి చోటు లభించింది. ఈ విషయాన్ని ఆదివారం యునెస్కో తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.