ఆన్‌లైన్ బెట్టింగ్.. ఇద్దురు వ్యక్తులు అరెస్ట్
VSP: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నేరంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ ద్వారా రూ.లక్షలు సంపాదించవచ్చని యువతను అందులోకి లాగుతున్న రాజువీధికి చెందిన చింతాడ రాజు, అనకాపల్లి (D) జంపెనకు చెందిన పుట్టా కళ్యాణ శ్రీనివాసరావుని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిన్నట్లు పోలీసులు తెలిపారు.