సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
KMM: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సైబర్ నేరాలపై గురువారం వాకార్స్, క్రీడాకారులకు, యువతకు ఖమ్మం టూ టౌన్ ఎస్సై రమేష్ అవగాహన కల్పించారు. మల్టీలెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, ఇతర సైబర్ నేరాల్లో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవగాహన కలిగి ఉండాలన్నారు.