'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'

'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు'

MNCL: మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం అర్ధరాత్రి పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.