VIDEO: 'కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'
AKP: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ.. గత సమ్మె కాలం ఒప్పందంలో భాగంగా 12వ పీ.ఆర్.సీ కమిటీని వేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.