PHCలో చొరబడిన విషసర్పం
ASR: జి.మాడుగుల ప్రైమరీ ఆసుపత్రి గేటు వద్ద ప్రమాదకర విష సర్పం కలకలం రేపింది. బుధవారం రాత్రి ఆస్పత్రి గోడపై పాము పాకుతుండగా రోడ్డుపై వెళ్తున్నవారు చూశారు. పాము గోడ దూకి మెయిన్ గేటు నుంచి లోపలికి ప్రవేశించింది. ఆస్పత్రి సిబ్బంది ప్రమాదకర రసల్ వైఫర్ పాముగా గుర్తించి హత మార్చారు. ఆసుపత్రి వద్ద పాములు సంచరిస్తున్నాయని, లైట్లు ఏర్పాటు చేయాలని సిబ్బందిచ, స్థానికులు కోరుతున్నారు.