పీకేవోసీను సందర్శించిన CMD బుద్ధ ప్రకాష్ జ్యోతి
BDK: మణుగూరు ఏరియా పీకేవోసీను CMD బుద్ధ ప్రకాష్ జ్యోతి శుక్రవారం సందర్శించారు. ముందుగా CMDకు ఏరియా జీఎం, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో బొగ్గు ఉత్పత్తి, కార్మికుల భద్రత తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. కార్మికులకు సేఫ్టీ తదితర ఎక్విప్మెంట్స్ అందజేయాలని సూచించారు.