ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ త్రిపాఠి
NLG: జీపీ ఎన్నికలను బాధ్యతతో, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మొదటి విడత నామినేషన్లను స్వీకరించనున్న నల్గొండ, చండూరు డివిజన్లకు సంబంధించి స్టేజ్1 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ఎంపీడీవోలకు బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. 117 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు.