ఆర్టీసీ ఇంద్ర బస్సులో ప్రయాణికులకు 20% రాయితీ
SKLM: ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 31 వ తేదీ వరకు 20 శాతం రాయితీతో ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం –విజయవాడ మధ్య తిరిగే బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుందని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజు ఉ. 6 గంటలకు రాత్రి 7 గంటలకు ఈ సౌకర్యం ఉందన్నారు.