విహార యాత్రలో విషాదం.. నీటిలో మునిగి మృతి

విహార యాత్రలో విషాదం.. నీటిలో మునిగి మృతి

JGL: కోరుట్ల పట్టణంలోని ఏకిన్ పూర్ చెందిన శీలం అజయ్ కుమార్ విహార యాత్రలో దుర్మరణం పాలయ్యాడు. స్నేహితులతో కలిసి కర్ణాటకకు టూర్‌కి వెళ్లిన అజయ్ కుమార్, అక్కడ ఒక వాటర్ ఫాల్స్ వద్ద ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడేందుకు స్నేహితులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో అజయ్ కుటుంబంలో, విషాదం నింపింది