ఎంఎస్ఎంఈ పార్కులకు భూములు గుర్తించండి: కలెక్టర్

ఎంఎస్ఎంఈ పార్కులకు భూములు గుర్తించండి: కలెక్టర్

NDL: కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ, నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటుకు ప్రభుత్వ భూములను గుర్తించాలంటూ ఆర్డీఓలు, తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. పాణ్యం, డోన్, ఆత్మకూరు మండలాల్లో భూముల లభ్యతపై చర్చ జరిగింది. రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ల కోసం ఇప్పటికే 765 ఎకరాలకు అంగీకారం లభించిందని వెల్లడించారు.