VIDEO: '100 పడకల ఆసుపత్రి పట్టణం కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి'
WGL: వర్ధన్నపేట పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని మొదట కేటాయించిన పట్టణ కేంద్ర ప్రాంతంలోనే నిర్మించాలంటూ స్థానికులు సోమవారం భారతీయ నాటక సమితిలో సమావేశమై డిమాండ్ చేశారు. ఆసుపత్రి స్థలాన్ని ఇతరచోటుకు మార్చే యత్నాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామీణులందరికీ సులభంగా అందుబాటులో ఉండాలంటే పట్టణ కేంద్ర ప్రాంతమే సరైనదని ప్రజలు పేర్కొన్నారు.