సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

BDK: డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువయ్యాయని ఏఎస్సై మల్సూరు తెలిపారు. పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలియని నంబర్ల నుంచి ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.