రంగశాయిపేటలో మేకల దొంగలు కలకలం
వరంగల్ జిల్లా రంగశాయిపేట యాదవవాడలో మేకల దొంగలు కలకలం సృష్టించారు. షెడ్‌లో ఉన్న 10 మేకలను అపహరించి పరారయ్యారు. ఈ చోరీ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.