VIDEO: కంకిపాడులో మారిన వాతావరణం
కృష్ణా: కంకిపాడు పరిసర ప్రాంతాల్లో బుధవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా, అనంతరం ఆకాశంలో మేఘాలు కమ్ముకుని చల్లని గాలులు వీచాయి. ఆకాశం రంగులు మారుతూ వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. కొన్ని చోట్ల స్వల్ప వర్షం కురిసే సూచనలు కనిపించాయి. మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి.