VIDEO: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత.. కట్టెల పొయ్యిపై వంటలు

VIDEO: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత.. కట్టెల పొయ్యిపై వంటలు

ASF: బెజ్జూర్ మండలంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. కొద్దిరోజులుగా గ్యాస్ అందుబాటులో లేక హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలపైనే టిఫిన్లు సిద్ధం చేస్తున్నారు. పొగ వల్ల ఇబ్బందులు ఎదురవుతుండటంతో కస్టమర్ల సంఖ్య తగ్గుతోందని, కొన్ని హోటళ్లు మూతపడ్డాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి వాణిజ్య సిలిండర్లను సరఫరా చేయాలన్నారు.