గుంటూరులో ఏపీపీ రాత పరీక్షలకు పటిష్ట బందోబస్తు
GNTR: గుంటూరు పలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ కాలేజీ ఇనిస్టిట్యూషనల్‌లో అక్టోబర్ 5న జరగనున్న 'అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల' (APP) రాత పరీక్షలకు గుంటూరు జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. IG సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, SP వకుల్ జిందాల్ పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించి భద్రతా చర్యలపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు.