VIDEO: శ్రీముఖ లింగంలో భక్తి శ్రద్ధలతో గోపూజోత్సవం

SKLM: జలుమూరు మండలం శ్రీముఖ లింగంలో శ్రీ రాధా గోవింద స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా గోపూజోత్సవం నిర్వహించారు. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టామని ఆలయ నిర్వాహకులు నవీన్ దాస్ పాడి తెలియజేశారు. ఈ క్రమంలో వినాయక పూజ, కలశారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తమ్మన వారి సతీష్ కుమార్, పలువురు పాల్గొన్నారు.